మన్యం న్యూస్,మణుగూరు(భూర్గంపాడు)
మండల పరిధి నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో బూసిపాక జయమ్మ నూతనంగా ఏర్పాటు చేసుకున్న పండ్ల దుకాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి చేతుల మీదుగా గురువారం ప్రారంభించడం జరిగింది. అనంతరం పండ్లు కొనుగోలు చేశారు. జయమ్మ వ్యాపారంలో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని రేగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
