మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు జరుగుతాయని రాజ్యసభ సభ్యుడు ఎంపీ కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ వద్దిరాజు రవిచంద్ర శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట రోడ్డుషోలలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారని ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.