మన్యం న్యూస్, దుమ్ముగూడెం నవంబర్ 18::
విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని దుమ్ముగూడెం పాఠశాల హెచ్ఎం ఏవి రామారావు పేర్కొన్నారు. శనివారం దుమ్ముగూడెం జడ్పీ హైస్కూల్ పాఠశాలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ విజయాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ మంచి అలవాట్లు అవలంబించుకొని క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని, ప్రతీ నెలలకోసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యా కమిటీ సభ్యులు శ్రీవిద్య షేక్ హుస్సేన్ అహ్మద్ సరిత గ్రామ పెద్దలు సీతారామారావు టీచర్లు లక్ష్మణ్ సత్యనారాయణ రామకృష్ణ సరోజినీ రజని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.