టాలీవుడ్‌లో ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కుతోన్న సినిమా ‘దేవర’. ఈ సినిమా వాయిదా పడనుందని తాజాగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మూవీ యూనిట్ స్పందించకపోయినప్పటికీ.. సినీ వర్గాల నుంచి కొన్ని గుస గుసలు వినిపిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘దేవర’ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్, రీసెంట్‌గా సైఫ్ అలీఖాన్ గాయపడటం.. తదితర కారణాలతో సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మేకర్స్ విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. అందువల్లనే ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీని గురించి చిత్రబృందం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.