కన్నడ సూపర్ స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా నటించిన చిత్రం ‘గంధద గుడి’. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. తర్వాత ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. ప్రస్తుతం కొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.