పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ మూవీ క్లైమ్యాక్స్ కోసమే భారీ బడ్జెట్ కేటాయించడంతో పాటు ముంబైలో ప్రత్యేకంగా సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ రూ.7-8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని సినీవర్గాలు తెలిపాయి.