‘నా జీవితంలో ఈ 50 రోజులు ఎంతో అద్భుతమైనవి. ఈ అనుభూతిని ఎలా చెప్పాలి? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు‘ అని దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెలిపాడు. హనుమాన్ 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా దర్శకుడు ట్వీట్ చేశాడు. ‘హనుమాన్’ అద్భుత విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.