మన్యం న్యూస్ చర్ల:
గ్రేస్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చర్ల మండలంలోని పూజారి గూడెం, లెనిన్ కాలనీ, సింగాసముద్రం గ్రామాలలో ఉన్న జి.యస్.యస్ డే కేర్ సెంటర్లోని 115 మంది నిరుపేద విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో చైల్డ్ కేర్ సెంటర్ ఇంఛార్జిలు పూజారి రాజేశ్వరి, లక్ష్మీ నారాయణ సంస్ధ ప్రతినిధులు మురళీ కృష్ణరెడ్డి , సతీష్ డే సీనియర్ జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్, డే కేర్ సెంటర్ సిబ్బంది, గ్రామస్తులు పలువురు పాల్గున్నారు.