నిర్మాత దిల్‌రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ‘‘నిర్మాతగా నా ప్రయాణం మొదలై 21 ఏళ్లు అవుతోంది. రానున్న నాలుగేళ్లలో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలని ఉంది. అందుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టాం’’ అని తెలిపారు. ‘‘ఆర్య’ విడుదలై మే 7వ తేదీతో 20 ఏళ్లు అవుతోంది. ఆరోజు రీ యూనియన్ ప్లాన్ చేస్తున్నామన్నారు. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ దాదాపు ఖరారైంది. శంకర్ చెప్పిన వెంటనే మేము అనౌన్స్ చేస్తామని చెప్పారు.