UPDATES  

 కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని మోదీ వ్యతిరేకులతో చేతులు కలిపారు కేసీఆర్. చాలామంది ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ను వచ్చి కలుస్తున్నారు. అందరూ కలిసి మోదీ మీద దండయాత్ర ప్రారంభించారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో అందరూ నినాదాలు పలికారు. రైతు పార్టీని పెడతా.. రైతుల కోసం పార్టీని పెడతా అని సీఎం కేసీఆర్ కూడా మోదీపై కారాలు, మిరియాలు నూరారు.

రైతు ప్రభుత్వం రావాలి దేశంలో అని చెప్పుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అనేదానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. కలిసిరాని కాలానికి ఎందుకు ఎదురు వెళ్లడం అని కేసీఆర్ అనుకుంటున్నారా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు అస్సలు కలిసిరావడం లేదు. కేసీఆర్ తో కలిసి రావడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. అందరూ కేసీఆర్ ను కలుస్తున్నారు. కేసీఆర్ తో మంచిగానే మాట్లాడుతున్నారు కానీ.. కేసీఆర్ తో కలిసి నడిచే విషయంలో మాత్రం చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లిన విషయం తెలిసిందే. నితీశ్ ను కలిసి తనతో కలిసి నడవాలని కోరారు.

కానీ.. ఇప్పుడు నితీష్ కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి మోదీని ఢీకొట్టేందుకు నితీష్ రెడీ అయిపోయారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు రెడీ అవడంతో ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లో ఉండరు అని అర్థం అయిపోయింది. మరోవైపు మమతా బెనర్జీ కూడా మోదీపై ఈ మధ్య ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. దీంతో మోదీకే మమతా ఓటేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట నడిచేది కేవలం కర్ణాటకకు చెందిన జనతాదళ్ పార్టీ నేత కుమార స్వామి మాత్రం కేసీఆర్ తో కలిసి నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ.. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి కుంభస్థలాన్ని ఢీకొట్టగలవా? అనేదే పెద్ద ప్రశ్న. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !