సారపాక, నవంబర్ 23, మన్యం న్యూస్ :
సారపాక గ్రామ పంచాయతీకి చెందిన తాత మాధవి లత పినపాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పినపాక నియోజకవర్గం ఇన్చార్జిగా మాధవి లత ను నియమిస్తూ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి, తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని పోతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు.