మన్యం న్యూస్ గుండాల: సీఎం సహాయ నిధి పేదవారి పాలిట వరంగా మారిందని ఎంపీటీసీలు సందాని, కృష్ణారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయ నిధి నుంచి మండల కేంద్రానికి చెందిన గడ్డం సత్యం కు 19,500, ఉప్పు మహేష్ కు 17,500 ఎమ్మెల్యే సీతక్క ద్వారా ఇప్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు. బలహీన వర్గాలు అనారోగ్యం పాలై తమ వేల రూపాయలు ఖర్చు చేస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారిని ఆదుకోవడంతో వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు ఉంటుందని వారు అన్నారు