UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

  • రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి
  • డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి
  • వీడియో కాన్ఫరెన్స్ లో..రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 24 .. రాష్ట్రవ్యాప్తంగా 2023 జనవరి 15 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్ధిదారులఎంపిక పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు గురువారం హైదరాబాద్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 18 వేల 328 కోట్ల వ్యయంతో 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి, పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా వంద శాతం సబ్సిడీతో పంపీణి చేసేలా సీఎం కేసీఆర్ ప్రాజెక్టు ను రుపోందించారని మంత్రి తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్లు నిర్మాణం తుది దశలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 26 వేల ఇండ్లను అందజేసామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్ లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించిన గ్రామం, పట్టణ పరిధిలో అధిక సంఖ్యలో అర్హులైన లబ్దిదారులకు ఉన్న నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హులు వివరాలతో వెయిటింగ్ లిస్టు జాబితా తయారు చేయాలని మంత్రి సూచించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పూర్తయిన ఇండ్ల పంపిణీ క్షేత్రస్థాయిలో సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీలో 18 వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ లకు మంత్రి సూచించారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌళిక వసతుల కల్పనకు రూ.205 కోట్లు మంజూరు చేశామని, నిధులను వినియోగించుకుంటూ మౌళిక వసతుల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 18 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 11,990 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని, నిధులకు ఎలాంటి కోరత లేదని, రాష్ట్ర వ్యాప్తంగా తుది నిర్మాణంలో ఉన్న 40 వేల రెండు పడక గధుల ఇండ్లు వేగవంతంగా పూర్తి జరిగేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వేగం పెంచాలని, ప్రతి మాసం పురోగతి పై రివ్యూ నిర్వహిస్తామని , జనవరి 15 నాటికి నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.
జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణి చేయాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాకు మంజూరు చేసిన ఇండ్ల సంఖ్య, టెండర్ పూర్తి అయినవి, నిర్మాణం ప్రారంభమైన ఇండ్లు, వివిధ దశలలో ఉన్న నిర్మాణ ఇండ్ల వివరాలు, అధికారుల ఎంపిక సంపూర్ణ అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పోడు సర్వే ప్రక్రియ, గ్రామ సభలు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. జిఓ 58, 59,ల్ మరియు 76 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ విచారణ ప్రక్రియను కూడా సత్వరమే పూర్తి చేస్తామని చెప్పారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ కు క్రీడా ప్రాంగనాలు ఏర్పాటుప్రక్రియను ప్రత్యేక అంశంగా చేపట్టి పూర్తి చేస్తా మని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !