నేడు పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం….
– రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు: నేడు మణుగూరు గిరిజన భవన్ నందు ఉదయం 9 గంటలకు పినపాక నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యూత్ అధ్యక్షులు సోషల్ మీడియా అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు 7 మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు తప్పనిసరిగా అధిక సంఖ్యలో పాల్గొని పినపాక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని అయన కోరారు.