UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ఈడీ దాడుల నేపథ్యంలో ఏసీబీని రంగంలోకి దించాలని నిర్ణయించిన కేసీఆర్‌ తక్షణం చర్యలు

ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల దాడులు, ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎప్పుడు తమవంతు వస్తుందో అని జంకుతున్న ఎమ్మెల్యేల ఒత్తిడితో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు సంస్థలకు చెక్‌ పెట్టేలా పెద్ద స్కెచ్‌ వేశారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకు ఏసీబీ అస్త్రం ప్రయోగించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ నేతలను కూడా టార్గెట్‌ చేయబోతున్నారు. KCR – MODI కేంద్రప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్‌.. సీఎం కేసీఆర్‌ కేంద్రంపై పోరు ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా టార్గెట్‌ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై నజర్‌ పెట్టిన గులాబీ బాస్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితాను రెడీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిలో లంచావతారాలను గుర్తించి వారిని టార్గెట్‌ చేసుకోవాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇక ఈడీ, ఐటీ అధికారులు దాడుల సమయంలో విచారణలో భాగంగా ఎవరిపైన అయినా చేయి చేసుకుంటే కేసులు నమోదు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

రంగంలోని ఏసీబీ.. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ముఖ్య నాయకులు, వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు టార్గెట్‌గా సాగుతున్న ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏసీబీని రంగంలోకి దించాలని నిర్ణయించిన కేసీఆర్‌ తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో డార్క్‌ రూమ్‌ దాడులపై కూడా పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడానికి ఏసీబీకి ఉన్న అధికారాలు, ఆ తర్వాత దశలో కేసు విచారణ చేయడానికి అనుమతి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చర్చించారు. ఫిర్యాదులు అందితే దాడులు.. కేసులే తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు అందితే తక్షణం వారిపై దాడి చేసి కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ప్రభుత్వం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులపై కూడా ఫోకస్‌ చేయనున్న కేసీఆర్, కేంద్రం, ఏ విధంగా అయితే దర్యాప్తు సంస్థలతో టీఆర్‌ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందో బీజేపీలోని కీలక నాయకులను అదేస్థాయిలో ఎమ్మెల్యేల ఎరకేసుతోపాటు, రకరకాల కేసుల్లో ఇరికించి ఒత్తిడికి గురిచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. KCR vs MODI ఏదేమైనా దెబ్బకు దెబ్బ తీయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆ దిశగా న్యాయనిపుణులతో చర్చించి కేంద్రంలోని అధికార బీజేపీ ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహాన్ని రచించారు. ఇక తాజాగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులను పలువురుని చీకటి గదిలోకి తీసుకు వెళ్లి అధికారులు చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు ఎవరైనా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని తెలంగాణ సర్కార్‌ ఆలోచిస్తోంది. మొత్తానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తూ సాగించే సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !