UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 మల్లారెడ్డి పై ఈడి దాడుల వ్యవహారంలో కొత్త కోణం

ఇంటిగుట్టు లంకకు చేటు. ఈ సామెత మంత్రి మల్లారెడ్డి విషయంలో నిజమైంది. గత రెండు రోజుల నుంచి ఈ డి అధికారులు మల్లారెడ్డి కార్యాలయాలు, నివాసాలపై దాడులు చేస్తున్నారు.. 50 బృందాల అధికారులు ఎడతెగని సోదాలు జరుపుతున్నారు. మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత ఎన్ని ఆస్తులు కూడ పెట్టారు, ఎక్కడెక్కడ స్థలాలు కొన్నారు, ఆయన ఎన్ని విద్యాలయాలకు అధిపతిగా ఉన్నారు, ఆయన బ్యాంకు ఖాతాల్లో ఎంత మేర లావాదేవీలు జరిగాయి అనే కోణాల్లో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కీలక పత్రాలు, పలు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అయితే మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్ సీట్లు, ఎమ్మెస్ సీట్లు అమ్ముకుని, వాటి ద్వారా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి మళ్ళించినట్టు ఈడి అధికారులు గుర్తించారు. మంత్రి మల్లారెడ్డి ఒకప్పుడు పాల వ్యాపారం చేసేవారు. అంచెలుఅంచలుగా ఎదిగి టిడిపిలో చేరారు.. ఇందులో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అయ్యారు. మల్లారెడ్డి మొదటి నుంచి వివాదాస్పద నేతగా పేరుపొందారు.. ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, అందులో వెంచర్లు వేసి విక్రయించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.. పైగా మల్లారెడ్డి విద్యాసంస్థలను ప్రభుత్వ భూములను ఆక్రమించి అందులో నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మధ్య వర్షాలు వచ్చినప్పుడు మల్లారెడ్డి ఆసుపత్రి నీట మునిగింది. ఇందుకు కారణం ఆస్పత్రిని చెరువు శిఖం ప్రాంతాల్లో నిర్మించడమే. దీనిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆ మధ్య ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి సంబంధించి ఆ నిర్వాహకుడికి మంత్రి స్వయంగా ఫోన్ చేసి బెదిరించడం అప్పట్లో కలకలం చెలరేగింది. అయితే ఇన్ని ఆరోపణలు ఉన్న మంత్రి మల్లారెడ్డి గుట్టుమట్లు మొత్తం కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు ఎలా తెలిసింది అనేది అందరిలో ఆసక్తి కలిగిస్తున్నది.

అయితే ఆయనకు తెలిసిన వారే ఈ పని చేశారని సమాచారం. మంత్రి మల్లారెడ్డి కి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. వీరిలో అతి కొద్ది మందికి మాత్రమే మంత్రి మల్లారెడ్డి వ్యాపారాలు తెలుసు.. అయితే వారిని తెలివిగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ట్రాప్ చేశారు.. వారిద్వారా మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన సమాచారాన్ని మరింత తెలుసుకున్నారు. తమకు అందిన వివరాలను, మంత్రి అనుచరులు చెప్పిన సమాచారాన్ని రూడీ చేసుకుని రంగంలోకి దిగారు.. అయితే వీరిలో నరసింహ యాదవ్ అనే వ్యక్తి ఈడి అధికారులకు చాలా కీలకమైన సమాచారం ఇవ్వడంతో వారు దాడులకు దిగినట్టు తెలుస్తోంది.. ముఖ్యంగా యాదాద్రి_ మల్కాజ్గిరి మధ్యలో, మేడ్చల్ నేషనల్ హైవే పరిధిలో ఇటీవల మంత్రి మల్లారెడ్డి వందల ఎకరాల భూములు కొన్నారు. ఈ భూములకు సంబంధించి రైతులకు తక్కువ ధర ఇచ్చారు. అయితే వీటితో పాటు ఆయన ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు కూడా మంత్రి మల్లారెడ్డికి అనుకూలంగా పనిచేయడంతో ఆయన పని సులభం అయింది.. అయితే ఇదే విషయాన్ని నరసింహ యాదవ్ ఈడి అధికారులకు ఉప్పందించారు. దీని ఆధారంగా ఈడి అధికారులు తీగంతా లాగారు. మల్లారెడ్డి డొంక మొత్తం కదిలింది. మల్లారెడ్డి ఇంట్లో జరుగుతున్న సోదాలకు సంబంధించిన విషయాలను ఈడి అధికారులు బయట పెట్టకపోయినప్పటికీ.. కీలకమైన పత్రాలు, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి బంధువు సంతోష్ రెడ్డి ఇంట్లో రెండు మూడు లాకర్లు బద్దలు కొట్టగా భారీ ఎత్తున నగదు బయటపడినట్లు సమాచారం. ఇదే సమయంలో మహేందర్ రెడ్డి ఇంట్లో లాకర్లు బద్దలు చేస్తుండగా ఆయన వారించారు. అందులో కూడా భారీ ఎత్తున నగదు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని కప్పిపుచ్చుకునేందుకే మహేందర్ రెడ్డి తన చాతిలో నొప్పి వస్తుందని ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో మల్లారెడ్డి గ్రూప్ కళాశాలలకు వరుస సెలవులు ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !