UPDATES  

 రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ లకు గుడ్ న్యూస్

రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ లకు గుడ్ న్యూస్. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ.. రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్ వైజార్ పోస్టుల భర్తీకి నెల రోజుల క్రితమే పరీక్షలు నిర్వహించింది. అయితే నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ జరగలేదని నియామక ప్రక్రియల్లో అవకతవకలు జరిగినట్లు కొంతమంది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అంగన్‌వాడీ టీచర్లుగా ఉన్న వారిని అధికారులుగా పదోన్నతి ఇవ్వటంపై.. నిర్వహించిన పరీక్ష విషయంలో స్టే విధించడం జరిగింది.

ఈ క్రమంలో బుధవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. విధించిన స్టే ఎత్తివేస్తూ తాజాగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.కొద్ది నెలల క్రితం అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో నిర్వహించిన పరిక్షలలో అవకతవకలు జరిగినట్లు.. కొంతమంది కోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టు.. విచారణ చేపట్టి ఆ పిటీషన్ కొట్టి వేయటంతో రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అంగన్‌వాడీ సూపర్ వైజర్(గ్రేడ్ 2) పోస్టుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు తప్పుడు ప్రచారాలు నమ్మద్దని స్పష్టం చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !