UPDATES  

 వాడి వేడిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం అయినా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరగబోతున్నాయి. గుజరాత్ లో ఇప్పటి వరకు ఆరు సార్లు బిజెపి అధికారంలో దక్కించుకుంది. అద్భుతమైన ఫలితాన్ని దక్కించుకుంటూ గుజరాత్లో బిజెపి నిలిచింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్లో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కక పోవడంతో గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ కి స్థానం లేదు అని అప్పటి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఐదు సంవత్సరాలు తిరిగే వరకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బిజెపికి ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ నిలిచింది. ఢిల్లీ నుండి పంజాబ్ కి తమ అధికారాన్ని విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ లోను జండా పాతెందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఎత్తుగడలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

గుజరాత్ కి బిజెపి మరియు కాంగ్రెస్ చేసిందేమీ లేదు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు అరవింద్ కేజ్రివాల్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడం కోసం ప్రయత్నించిన పార్టీ నాయకులు ఇప్పుడు గెలిచి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే అక్కడ రాజకీయంగా ఎంత మార్పు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు మోడీ మరియు కాంగ్రెస్ నాయకులు మాత్రం గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి కూడా డిపాజిట్లు దక్కవు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగలిగితే దేశ వ్యాప్తంగా కూడా రాబోయే పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి కచ్చితంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీ వాల్ మాత్రమే సరైన పోటీ అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !