తమిళనాడుమాజీ ముఖ్యమంత్రిజయలలితచనిపోయి ఏళ్ళు గడస్తున్నాయి. కానీ, ఆమె మరణానికి అసలు కారణమేంటన్నది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు నెలలకుపైగానే జయలలిత ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చేరాక జయలలిత ఎలా వున్నారన్నదానికి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు. దాదాపు రెండున్నర నెలల హైడ్రామా తర్వాత, జయలలిత పార్దీవ దేహం మాత్రమే ఆసుపత్రి నుంచి బయటకు రావడాన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసులు వున్నారా.? లేరా.? జయలలితకు ఓ కూతురు వుందనే ప్రచారం అప్పట్లో జరిగింది.
కాదు కాదు, ఆమెకు ఓ కొడుకున్నాడని అంటారు. నిజానికి, జయలలిత అవివాహిత. ‘కుమారి జయలలిత’గానే ఆమెను ప్రస్తావిస్తారు. మరెలా, జయలలితకు వారసులుంటారు.? జయలలితకు శశికళ అత్యంత సన్నిహితురాలు. జయలలితకు మేనకోడలు వుంది. కానీ, వాళ్ళెవరూ జయలలిత యోగక్షేమాల్ని చివరి రోజుల్లో దగ్గరుండి చూసుకోలేక పోయారు. శశికళ అయితే అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళారనుకోండి.. అది వేరే సంగతి. కాగా, జయలలితకు వారసులు వుండుంటే, ఆసుపత్రిలో సహాయకులుగా వుండేవారంటూ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి వ్యాఖ్యానించడం పెను సంచలనంగా మారింది.