మన్యం NEWS , కరకగూడెం: మండల పరిధిలోని కన్నయిగూడెం గ్రామ పంచాయతీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను మండల పార్టీ,యువజన విభాగం నాయకులు పరిశీలించారు.
పనుల్లో నాణ్యత పాటించాలని,పనుల్లో జాప్యం జరగకుండా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నారని,త్వరలో పేదలకు ఈ ఇండ్లను అందజేస్తామన్నారు. ఇవే కాకుండా సొంత జాగాలో ఇల్లు నిర్మించుకునేవారికి 3 లక్షల రూపాయలు అందజేస్తామని టిఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల సీనియర్ నాయకులు రేగా సత్యనారాయణ,గొట్టముక్కల ఉప్పలరెడ్డి,పినపాక నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ మిట్టపల్లి సాగర్ యాదవ్,మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,మండల యూత్ జనరల్ సెక్రెటరీ కటుకోజ్వల దిలీప్ కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు పులి శ్రీధర్,ప్రధాన కార్యదర్శి ఊకే నరేష్,గ్రామ కమిటీ యూత్ ప్రెసిడెంట్ పోలెబోయిన శేఖర్,స్థానిక నాయకులు పోలెబోయిన రంగయ్య,కల్తి సందీప్,ఇస్లావత్ మోహన్ లాల్,సోషల్ మీడియా కో కన్వీనర్ గిద్దె సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.