‘మెహబూబా’ సినిమా కోసం పూరీ జగన్నాధ్ కంపెనీ నుంచి దిగుమతి అయిన మంగుళూర్ భామ నేహాశెట్టి. తొలి సినిమాతోనే కుర్రోళ్లకు తెగ నచ్చేసింది. పాకిస్థానీ యువతి పాత్రకి ‘మెహబూబా’లో సరిగ్గా నప్పేసిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘గల్లీ రౌడీ’ సినిమాలో నటించింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ‘డీజె టిల్లు’ సినిమా నేహా శెట్టికి బాగా గుర్తింపు తెచ్చింది. పొట్టి నిక్కరులో వయ్యారాలు పోతున్న టిల్లు గాని గాళ్ ఫ్రెండ్.. రాధిక పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది నేహా శెట్టి ఈ సినిమాలో. ఈ సినిమా రికార్డు స్థాయిలో విజయం అందుకోవడమే కాదు, రాధికగా నేహా శెట్టి రోల్ కూడా ట్రెండింగ్ అయిపోయింది.
అయితే, రెండో టిల్లు.. అదేనండీ.. డీజె టిల్లు సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నేహా శెట్టి చోటు దక్కించుకోలేకపోయింది ఎందుకో పాపం. ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో నటిస్తోంది. కానీ ఇది చాలదు అమ్మడికి నటిగా ప్రూవ్ చేసుకోవడానికి. మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకోవాలి. అందుకే, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటూ, అందాల ఫోటోలతో ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది. టిల్లుగాడి పుణ్యమా అని వచ్చిన క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి నెట్టింటిని బాగానే వాడేస్తోందీ మంగుళూర్ ముద్దుగుమ్మ. తాజాగా పొట్టి నిక్కరేసుకుని, వయ్యారాలు పోతూ, కవ్విస్తూ కైపెక్కిస్తోంది నేహా శెట్టి.