UPDATES  

NEWS

 భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుబాయ్‌లో పార్టీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుబాయ్‌లో పార్టీ చేసుకున్నాడు. ధోనీ తన భార్య సాక్షితో పాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, రాపర్‌ బాద్‌షా తదితరులతో కలిసి దుబాయ్‌లో బర్త్ డే పార్టీ చేసుకున్నాడు. ఈ పార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక వీడియోలో, హార్దిక్, ధోనీ వంటి వారు రాపర్ ట్రాక్‌కు స్టెప్పులేసినట్లు కనబడుతోంది. తన డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడమే కాకుండా, రాపర్ పాడేటప్పుడు పాజ్ చేస్తున్నప్పుడు ప్రముఖ క్రికెటర్ కూడా వీడియోలో పాడటం కనిపించింది.

బాద్షా తన సాధారణ పొడవాటి నలుపు జాకెట్ లుక్‌లో ఉండగా, హార్దిక్ సిల్క్ షర్ట్ ,ప్యాంటులో, ధోని బ్లాక్ సూట్‌లో ఉన్నారు. 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు సంపాదించిపెట్టిన ధోనీ.. ఆపై టీ-20 సిరీస్‌లలో ధీటుగా రాణించాడు. జట్టును సక్సెస్ బాట పట్టించాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా వున్న ధోనీ.. గోల్ఫ్ సెషన్‌లలో, స్థానిక టెన్నిస్ టోర్నమెంట్‌లు ఆడుతున్నాడు. తన ఫ్యాన్సీ బైక్‌లు, కార్లను నడుపుతూ హ్యపీగా వున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున ఆడనున్న ధోనీ.. 2023 ఐపీఎల్‌కు కెప్టెన్సీ సారథ్యం వహిస్తాడని తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !