UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 AIR INDIAలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం

ఎయిరిండియా సంస్థ బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగనుంది. ఎయిరిండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం కానుంది. ఇందుకు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అంగీకారం తెలిపాయి. ఈ విలీన ప్రక్రియను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువును నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. టాటాతో జాయింట్ వెంచర్‌లో వున్న విస్తారాలో మైనారిటీ వాటాను కలిగి ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, విస్తరించిన ఎయిర్ ఇండియాలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంటుంది.

ఇది రూ. 2వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం, విస్తారాలో 51 శాతం వాటా టాటా వద్ద ఉండగా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ 2013లో ఏర్పాటు చేసిన జాయిన్ వెంచర్‌లో మిగిలిన 49 శాతాన్ని కలిగి ఉంది. ఇది విమానాల సంఖ్యను 218కి పెంచుతుంది. ఎయిర్ ఇండియా ప్రస్తుతం 113 విమానాలను, ఎయిర్ ఏషియా ఇండియా 28, విస్తారా 53, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 24తో కలిపి విమానాల సంఖ్య ఈ డీల్ ద్వారా పెరుగుతుంది. తద్వారా భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్, రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిరిండియా మారుతుందని టాటా సన్స్ తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !