UPDATES  

 MLC కవిత స్పందిస్తూ ట్విట్టర్ లో కమలం వదిలిన బాణం అంటూ వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. షర్మిల చేస్తున్న హడావుడి నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ట్విట్టర్ లో కమలం వదిలిన బాణం అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాంతో షర్మిల కాస్త సీరియస్ గానే ట్విట్టర్ లో.. పాదయాత్రలు చేసింది లేదు, ప్రజల సమస్యలు చూసింది లేదు. ఇచ్చిన హామీలు అమలు చేసింది లేదు. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో కవితలకు కొదవలేదు అంటూ విభిన్నంగా టిఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ కవితకి కౌంటర్ ఇచ్చింది. షర్మిల ట్వీట్ కి కవిత మళ్లీ కౌంటర్ ఇచ్చింది. కాస్త సీరియస్ గానే ట్వీట్ చేసింది.

షర్మిల యొక్క తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఎండగట్టడంతో పాటు తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతులంటూ కవిత పేర్కొన్నారు. షర్మిల బీజేపీ కోవర్ట్‌ అంటూ బిజెపి షర్మిల దొంగాటను ఎండగట్టింది. పొలిటికల్ టూరిస్ట్ లం కాదని.. ఉద్యమ బిడ్డనంటూ కవిత తనదైన శైలిలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం షర్మిల మరియు కవితల యొక్క ట్వీట్స్ వారు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కవిత ట్వీట్‌… అమ్మా.. కమల బాణం ఇది మా తెలంగాణం పాలేవో నీళ్ళేవో తెలిసిన చైతన్య ప్రజా గణం మీకు నిన్నటిదాకా పులివెందులలో ఓటు నేడు తెలంగాణ రూటు మీరు కమలం కోవర్టు ఆరేంజ్ ప్యారేట్టు మీ లాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను రాజ్యం వచ్చాకే రాలేదు నేను ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి ” కవిత” ను నేను !

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !