శ్రద్ధాంజలి ఘటించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు
మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తోలెం రవీందర్ గుండెపోటుతో మరణించారు విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ నివాసానికి వెళ్ళి మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తోలెం.సావిత్రి,నాయకులు తోలెం.సారయ్య,కొమరం.సురేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామటంకి పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.