తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన యలమంచి వంశీకృష్ణ.
మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 30::
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా మండలానికి చెందిన ఎలమంచి వంశీకృష్ణ ఎన్నుకోవడం తో హర్షం వ్యక్తం చేసిన మండల నాయకులు. నల్లగొండలో జరిగిన రెండో మహాసభ లో రాష్ట్ర కమిటీలు ఎన్నుకోవడం జరిగింది మొదటి నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన యువజన సంఘం మండల కమిటీ నుండి డివిజన్ అధ్యక్షులుగా, రాష్ట్ర విభజన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై తర్వాత దుమ్ముగూడెం మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శిగా అనంతరం గత జులై 30వ తేదీన జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడుగా, ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు నల్లగొండలో జరిగిన సభలో రాష్ట్ర కమిటీలో ఎన్నుకోవడంతో అతి చిన్న వయసు నుండి అంచలంచలుగా ఎదుగుతూ తాతగారి సీతారామయ్య స్ఫూర్తిని తీసుకొని గొప్ప నాయకుడిగా సమాజ సేవకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల్లో ఎన్నుకోవడం బాధ్యతగా తీసుకొని రైతు సమస్యల పోరాటం కోసం కృషి చేస్తానని, అలానే నాకు సహకరిస్తున్న నాయకులకు కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.