*నూతనంగా వచ్చిన డాక్టర్ ని సన్మానించిన ఎంపీపీ జల్లిపల్లి*
*మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 30:* మండల పరిధిలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల నందు ఎమ్మెల్యే మెచ్చా కృషితో నూతనంగా వచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలతని శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేసి జాయినింగ్ ఆర్డర్ కాపీ నీ అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా వచ్చిన డాక్టర్ లకి అశ్వారావుపేట మండల ప్రజల తరుపున ప్రత్యేక శుభాకంక్షలు తెలుపుతూ మండల ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మంచి వైద్యం అందించాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపర్ డెంట్ డాక్టర్ జయలక్ష్మి, క్రిష్ణ కాంత్, అరుణ్ కాంత్, పూర్ణ చందర్ రావు, మౌనిక, నర్సింగ్ సూపర్ డెంట్ ఊర్మిళ, లాబ్ టెక్నీషియన్ జిలానీ, తెరాస పార్టీ మండల ఉపాధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, తెరాస పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, సీనియర్ నాయకులు నార్లపాటి రాములు, కలపాల శ్రీనివాస్, శెట్టిపల్లి రఘురామ్ హాస్పిటల్ సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.