UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 బర్మావత్ సీతియా నాయక్ కి నివాళులర్పించిన మండల టిఆర్ఎస్ శ్రేణులు….

బర్మావత్ సీతియా నాయక్ కి నివాళులర్పించిన మండల టిఆర్ఎస్ శ్రేణులు….

మన్యం న్యూస్ చండ్రుగొండ నవంబర్ 30: మండల పరిధిలోని తుంగారం గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ బర్మావత్ సీతియా నాయక్ దశదిన కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబనికి ప్రగడ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధారా బాబు మాట్లాడుతూ… తుంగారం గ్రామపంచాయతీ 5 వార్డు మెంబర్ పలుసార్లు గెలుపొందారని ,గతంలో ఎల్వి రెడ్డి బస్సు ప్రమాదపు శాత్తు తుంగారం బ్రిడ్జి మీద నుండి వాగులో పడిన సంఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఆ సమయంలో మేకలు కాపరిగా ఉన్న బర్మావత్ సీతియా నాయక్ తన ప్రాణం సైతం లెక్కచేయకుండా స్కూల్ పిల్లల ను పదుల సంఖ్యలో పిల్లలను కాపాడిన సీతీయా నాయక్ కు ప్రభుత్వం 10000 నగదు రివార్డు అందుకున్నారని, భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు గుర్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, మేడా మోహన్ రావు, సూరా వెంకటేశ్వర్లు,సత్తి నాగేశ్వరరావు,బానోత్ బిలు నాయక్,శ్రీనివాస్ నాయక్, బిలియా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !