పౌర హక్కుల పై అవగాహన మన్యం న్యూస్ నవంబర్ 30 వాజేడు. మండలంలో కుంగాల గ్రామపంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీ గ్రామం లో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ గూడూరు లక్ష్మణ్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దళితుల పై వివక్ష , దళితుల హక్కులను హరించడం, వంటి సమస్యలు దళిత సమాజం పైన ప్రభావితం చూపించాయి.పౌర హక్కులు రక్షించుకునేందుకు హక్కులపై అవగాహన అవసరం అని తహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.