*అశ్వారావుపేట సీహెచ్సి లో నేటి నుండి అందుబాటులో ఉండనున్న గైనకాలజిస్ట్
*మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపిన ఎంఎల్ఏ మెచ్చా
*అశ్వారావుపేట సీహెచ్సి లో ఏడు కి చేరిన వైదుల సంఖ్య
*మన్యం న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 30:* అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావు చొరవతో డిసీహెచ్సీ డాక్టర్ రవి బాబు నాయక్ సహకారంతో అశ్వారావుపేట సీహెచ్సీకి గైనకాలజిస్ట్ గా డాక్టర్ స్వర్ణలత గుమ్మడి ని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నదని, అశ్వారావుపేటకి గైనకాలజిస్ట్ నీ నియమించిన మంత్రి తన్నీరు హరీష్ రావుకి మరియు జిల్లా కలెక్టర్ అనుదిప్ కి, డిసీహెచ్సీ డాక్టర్ రవి బాబు నాయక్ ని ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూడటం వారి బాధ్యతని, ప్రజలు ఇక దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని నేటి నుంచి డాక్టర్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.