UPDATES  

 మొదలైన తొలి టెస్టుల్లో పరుగుల వరద

ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ ల్లో ఒక్క ఇన్నింగ్స్ పూర్తయ్యేప్పటికీ 300 నుండి 400 పరుగులు చేసేవారు. రెండు రోజులు లేదా మూడు రోజులు బ్యాటింగ్ లో ఈ పరుగులు సాధ్యమయ్యేవి. కానీ టీ20 ఫార్మేట్ వచ్చిన తర్వాత మెల్లగా ఆడడం అనేది లేకుండా పోయింది. వన్డేలు టెస్టుల్లో కూడా బ్యాట్స్‌మెన్స్‌ బౌలర్ల పై విరుచుకుపడుతున్నారు. తాజాగా టెస్ట్‌ మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లాండు క్రికెట్ జట్టు రావల్పిండి

వేదికగా మొదలైన తొలి టెస్టుల్లో పరుగుల వరద పారించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండు టీ 20 మ్యాచ్‌ తరహా లో బ్యాటింగ్ చేసి దుమ్ము రేపింది. మొదటి రోజు నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 506 పరుగుల భారీ స్కోర్‌ ను నమోదు చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్స్‌ సెంచరీ చేయడం ఇక్కడ ప్రత్యేక విషయం. ఇది ఒక ప్రపంచ రికార్డుగా క్రికెటర్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ముందు ముందు టెస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా ఇలాగే ఉండబోతున్నాయంటూ క్రికెట్ మరియు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ తరహా బ్యాటింగ్ తో టెస్ట్ మ్యాచ్ లను చూడడం మరింత రసవత్తరంగా ఉంటుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !