UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మన త్రివర్ణ పతాకంపై ఫిఫా ప్రపంచకప్ వేదికపై

ఫిఫా ప్రపంచకప్‌లో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జైహింద్ అంటూ నినాదాలు హోరెత్తాయి.. ఏంటి ఇదంతా నిజమా? భారత్ ఎప్పుడు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో అర్హత సాధించింది? అని అనుకుంటున్నారా.. అయితే ఫిఫా ప్రపంచకప్‌లో ఇండియా భాగం కానప్పటికీ.. మన జెండా వరల్డ్ కప్ వేదికపై కనిపించింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫ్యాన్ ఫెస్ట్ సందర్భంగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఓ అభిమాని భారత జెండాను ఇవ్వగా.. వేదికపై నుంచే ఆమె జెండాను ఎగరేస్తూ.. ఇండియన్ ఫ్యాన్స్ హృదయాలను గెల్చుకుంది. ఫిఫా ప్రపంచకప్ 2022 ఫ్యాన్స్ ఫెస్ట్‌ కోసం నోరా ఫతేహి తన ప్రత్యేకమైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఇంతలో ఓ అభిమాని ఆమెకు భారత జెండాను అందించాడు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న నోరా.. జైహింద్ అనాలంటూ ప్రేక్షకులను పిలుపునిచ్చింది. ఎవరైనా జైహింద్ అంటారా? అని అడిగింది. దీంతో భారత అభిమానులంతా జైహింద్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. అంతేకాకుండా జెండాను భుజంపై వేసుకుని ఎగరేసింది. ఆ విధంగా మన త్రివర్ణ పతాకంపై ఫిఫా ప్రపంచకప్ వేదికపై రెపరెప లాడింది. “భారత్ ఫిఫా ప్రపంచకప్‌లో భాగం కాదు.. కానీ సంగీతం, డ్యాన్స్ లాంటి కళలతో మేము స్ఫూర్తి నింపుతాం” అంటూ తన ప్రదర్శనతో హోరెత్తించింది. ఈ వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. మన దేశానికి చెందిన వ్యక్తి కాకపోయినా నోరాను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఓ యూజర్ తన స్పందనను తెలియజేశాడు. చాలా మంది ఆనంద భాష్పాలను రాలుస్తున్నట్లు రెడ్ హార్ట్ ఎమోజీలను జత చేశారు. ఎలాంటి మధురమైన క్షణాలను ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. నోరా ఫతేహి చివరగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన థ్యాంక్ గాడ్ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. ఇది కాకుండా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఇటీవలే నషా రీమిక్స్ సాంగ్‌లోనూ కనిపించింది. ఈ పాట నవంబరు 12న విడుదలైంది. ప్రస్తుతం జాన్ అబ్రం, రితేశ్ దేశ్‌ముఖ్, షెహనాజ్ గిల్ నటిస్తున్న 100 పర్సెంట్ చిత్రంలో కనిపించనుంది. Dailyhunt

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !