UPDATES  

 వరు చిత్రాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్

టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ వరు చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే పలు చిత్రాలతో సందడి చేసిన ఈ హీరో.. త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా టైటిల్ టాప్ గేర్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే ఓ పాట, గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. తాజాగా మరో సరికొత్త అప్డేట్‌ను తీసుకురానుంది. టాప్ గేర్ చిత్ర టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. టాప్ గేర్ టీజర్‌ను హిట్ చిత్రాల దర్శకుడు మారుతీ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబరు 3 ఉదయం 11 గంటలకు టాప్ గేర్ టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో గన్ పట్టుకున్న ఆది సాయి కుమార్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. టాప్ గేర్ చిత్రంలో ఇప్పటికే వెన్నెలవే పాట విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా అన్ని వర్గాల శ్రోతలను అలరించింది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించాడు. దీంతో చిత్రంపై విపరీతంగా బజ్ ఏర్పడింది. డిసెంబరు 30న చిత్రం విడుదల కానుంది. శ్రీ ధనలక్ష్మీ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రియా సుమన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. కే శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్. మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. డిసెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !