UPDATES  

 టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ-2 చిత్రం ఎంత పెద్ద విజయం సా

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ-2 చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిన్న సినిమాగా విడుదలై అదిరిపోయే వసూళ్లతో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా హిందీ బెల్టులో అదిరిపోయే వసూళ్లను సాధించింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫలితంగా రూ.120 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. థియేటర్లోనే కాకుండా ఓటీటీలోనూ విడుదలై ట్రెండింగ్‌గా నిలిచింది. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంతం భారీ విజయంగా నిలిచిన కార్తికేయ-2 మరో అరుదైన ఘనతను సాధించింది.

థియేటర్లు, ఓటీటీ.. తాజాగా బుల్లితెర(టెలివిజన్)పై కూడా అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో ఈ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ అధికంగా వచ్చాయి. మొదటి సారి టీవీలో ప్రసారమైన ఈ చిత్రం మొత్తంగా 7.88 రేటింగ్‌తో అరుదైన ఘనత సాధించింది. బుల్లితెర ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుందనడానికి ఇదే నిదర్శనం.

థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అదిరిపోయే వసూళ్లను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలైన కేవలం 48 గంటల్లోనే 100 కోట్లకుపైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న కార్తికేయ 2 విజృంభణ గురించి జీ2 సంస్థ అధికారికంగా ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !