దేశముదురు సినిమా తో చిన్న వయసులోనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు తెలుగుతో పాటు తమిళం లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ అక్కడ ఇక్కడ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగులో దాదాపు దశాబ్దా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన హన్సిక ఈ మధ్య కాలంలో పూర్తిగా తమిళ సినిమాల్లోనే నటిస్తోంది. ఈ సమయం లోనే తన వ్యాపార భాగస్వామి అయినా వ్యక్తితో ప్రేమలో పడిందని.. అతడిని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా హన్సిక పెళ్లికి సంబంధించిన హడావుడి మొదలైంది. హన్సిక మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హన్సిక రాజస్థాన్ లోని అత్యంత ప్రాచీనమైన ఒక కోటలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. డిసెంబర్ 4 తారీఖున వీరి వివాహం జరగబోతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న హన్సిక ఎంత సంతోషంగా ఉందో ఈ ఫొటోస్ ని చూస్తే అర్థమవుతుంది.