UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 కాంతార నిర్మాతతో కీర్తిసురేష్ LADY ఓరియెంటెడ్ సినిమా

కేజీఎఫ్, కాంతార విజయాలతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరికి సుపరిచితమైంది కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ సినిమా రూపొందుతోంది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ తొలిసారి తమిళంలో ఓ సినిమాను నిర్మించబోతున్నది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు రగ్‌తాథా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆదివారం రగ్‌తాథా సినిమా ప్రారంభమైంది. కీర్తిసురేష్ స్కెచ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పోరాటయోధురాలిగా కీర్తిసురేష్ కనిపిస్తోంది.

విప్లవం ఇంటి నుంచే ప్రారంభమవుతుంది అంటూ ఈ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వంలో వహిస్తోన్నారు. ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రగ్‌తాథాఅంటూ కీర్తిసురేష్ ఈ సినిమా పోస్టర్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఆసక్తిని పంచుతోంది. హిందీ లాంగ్వేజ్‌పై సెటైరికల్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ ఫొటోలను కీర్తిసురేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో దసరా, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో మామన్నన్ సినిమా చేస్తోంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !