బిగ్‌బాస్ 6 తెలుగులో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్‌కు అడివిశేష్ గెస్ట్‌గా హాజరుకానున్నాడు. హౌజ్‌మేట్స్‌తో కలిసి అడివి శేష్ సందడి చేసినట్లుగా కొత్త ప్రోమోలో చూపించారు.ఈ ప్రోమోలో కోడి బుర్ర అని రాసి ఓ హారర్ డిజైన్ వేయమని కంటెస్టెంట్స్‌కు నాగార్జున చెప్పాడు. ఆ డిజైన్ వేసింది ఎవరో అడివిశేష్ కనిపెడతాడని నాగార్జున అన్నాడు. డిజైన్ వేసింది ఎవరో కనిపెట్టే క్రమంలో రోహిత్, ఆదిరెడ్డి…అడివిశేష్‌పైనే పంచ్‌లు వేశారు. రఫ్‌గా డిజైన్ వేశారు కాబట్టి ఇది అబ్బాయిల పనేనని అడివిశేష్ కామెంట్స్ చేయడం, మా చేతులు కూడా రఫ్‌గానే ఉన్నాయంటూ ఫైమా అందుకు బదులివ్వడం ఆకట్టుకుంటోంది. ఇనాయా చేతులు లైఫ్‌లో ఎప్పుడూ హార్డ్ వర్క్ చేయనట్లుగానే ఉన్నాయంటూ అడివిశేష్ వేసిన పంచ్ నవ్వులను పంచింది. ఆమె మైండ్‌లో ఎప్పుడూ కోడి ఉంటుందని శ్రీసత్యను ఉద్దేశించి నాగార్జున చేసిన కామెంట్స్ ప్రోమోకు హైలైట్‌గా నిలిచాయి. ఫైమా ఎలిమినేట్… ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందరికంటే అతి తక్కువ ఓట్లు ఆమెకు పడినట్లు సమాచారం. గత వారమే ఫైమా ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఎవిక్షన్ పాస్ వల్ల చివరి నిమిషంలో సేఫ్ అయ్యింది. దాంతో రాజ్ హౌజ్ నుంచి వెళ్లిపోయాడు. ఈ వారం మాత్రం ఫైమాకు ఆ అవకాశం లేదు. రేవంత్‌కు కూతురు… కాగా శనివారం ఎపిసోడ్‌లో రేవంత్‌ను కన్ఫేషన్ రూమ్‌కు పిలిచిన బిగ్‌బాస్ అతడికి కూతురు పుట్టిన సంగతిని తెలియజేశాడు.
హౌజ్‌మేట్స్‌తో కలిసి ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు రేవంత్. ఆ తర్వాత గ్రాండ్ టూ ఫినాలే చివరి టాస్క్ లో శ్రీహాన్ విన్నర్‌గా నిలిచాడు. రేవంత్ కోపంతో గేమ్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. ఆదిరెడ్డి ఎంత నచ్చచెబుతున్న రేవంత్ వినలేదు. అరుస్తూనే ఉన్నాడు. రేవంత్ చేతుల మీదుగా టికెట్ టు ఫినాలే షీల్డ్ శ్రీహాన్ అందుకున్నాడు. రేవంత్‌కు నాగార్జున క్లాస్… టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో సంచాలక్ ఆదిరెడ్డి నిర్ణయం కరెక్ట్ అని నాగార్జున మెచ్చుకున్నాడు. తన తప్పును రేవంత్ అంగీకరించాడు. ఆటగాడు ఆటగాడిలా ఉండాలి ఎంపైర్‌లా ఆలోచించవద్దని రేవంత్‌కు నాగార్జున క్లాస్ ఇచ్చాడు. ఈ మధ్య శ్రీసత్యకు కోపం ఎక్కువగా వస్తోందని నాగార్జున పేర్కొన్నాడు. భోజనం మీద కోపం చూపించవద్దని వార్నింగ్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ రిగ్రేట్స్ బిగ్‌బాస్ హౌజ్‌లో పదమూడు వారాల్లో రిగ్రేట్‌గా ఫీలయిన వారం ఏదో చెప్పమని నాగార్జున కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఇచ్చాడు. 12వ వారంలో తాను రిగ్రేట్‌గా ఫీలయినట్లు శ్రీహాన్ చెప్పాడు. తన వెటకారం వల్ల అందరూ బాధపడుతున్నారనే విషయం ఆ వారం లోనే అర్థమైందని అన్నాడు. ఎనిమిదో వారంలో గీతూను హర్ట్ చేశానని అలా చేసుండకపోతే బాగుండునని రేవంత్ అన్నాడు. ఫిజికల్ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఇనాయా లతో అగ్రెసివ్‌గా వ్యవహరించానని రేవంత్ పేర్కొన్నాడు.