UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 ఉత్కంఠభరిత పోరులో BANGLADESH విజయం..

తొలి వన్డేలో భారత్‌ను బంగ్లాదేశ్ చిత్తుచేసింది. ఆఖర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. బంగ్లా ఆల్‌రౌండర్ మెహీది హసన్ (38) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10)తో కలిసి ఆఖరి వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి విజయ తీరాలకు చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. కష్టతరం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను భారత బౌలర్లు మొదట ఇబ్బంది పెట్టినా చివర్లో పట్టు విడిచారు. టీమిండియా బౌలర్లలో మహ్మాద్ సిరాజ్ 3, కుల్దీప్ సేన్ 2, వాషింగ్టన్ సుందర్ 2, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌ను బంగ్లాదేశ్ బౌలర్ల బాగా ఇబ్బంది పెట్టారు. కేఎల్ రాహుల్ (73) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం విఫలమయ్యారు. హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ (27), శిఖర్ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9), శ్రేయాస్ అయ్యర్ (24), వాషింగ్టన్ సుందర్ (19), షాబాద్ అహ్మాద్ (0), శార్దుల్ ఠాకూర్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాటపట్టారు. షకీబుల్ అల్ హాసన్ ఐదు, ఎబాడోత్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీశారు. అనంతరం 187 లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను ఆరంభం నుంచే భారత బౌలర్ల చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి దీపక్ చాహర్ దెబ్బతీశాడు. నజ్ముల్ హుస్సేన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం 26 పరుగుల వద్ద బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది.

అనాముల్ హక్ ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత కెప్టెన్ లిటన్ దాస్ (41), షకీబ్ అల్ హసన్ (29) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంతో బంగ్లా జట్టు కోలుకున్నట్లే కనిపించింది. అయితే 74 పరుగుల వద్ద లిటన్ దాస్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. కాసేపటికే షకీబుల్ హాసన్‌ను కూడా సుందర్ ఔట్ చేయడంతో 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్ పట్టి షకీబ్ అల్ హసన్‌ను డగౌట్‌కు పంపించాడు. 128 పరుగుల వద్ద మహ్మదుల్లా (14)ను శార్దుల్ ఠాకూర్ ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్ మొదటి బంతికే ముష్ఫికర్ రహీమ్ (18) క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం దాదాపు ఖాయమని అందరూ అనుకున్నారు. అరంగేట్ర బౌలర్ కుల్దీప్ సేన్ తన కెరీర్‌లో తొలి వికెట్ తీయడంతో బంగ్లా స్కోరు బోర్డు 134-7గా నిలిచింది. అదే ఓవర్‌లో కుల్దీప్ మరో వికెట్ తీయగా.. హసన్ మహమూద్‌ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 136 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలబడింది. ఈ సమయంలోఈ సమయంలో మెహీది హసన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ ఎండ్‌లో ముఫ్తికర్ రెహ్మాన్ నిలబెట్టి చెలరేగి ఆడాడు. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కేఎల్ రాహుల్ విడిచిన సులవైన క్యాచ్‌తో ఊపిరి పీల్చుకున్న హసన్ ఫోర్లు, సిక్సర్లతో బంగ్లాను గెలిపించాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !